Home వార్తలు అక్టోబర్ 8న విడుదలవుతున్న గోపీచంద్, నయనతార, బి. గోపాల్, జయ బాలాజీ రియల్ మీడియా...

అక్టోబర్ 8న విడుదలవుతున్న గోపీచంద్, నయనతార, బి. గోపాల్, జయ బాలాజీ రియల్ మీడియా ఆరడుగుల బుల్లెట్..

242
0

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ జానర్‌లో ఆరడుగుల బుల్లెట్ సినిమా తెరకెక్కింది. గోపీచంద్ సరసన నయనతార  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వ్యవహరించారు. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్  యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన  ఆరడుగుల బుల్లెట్  చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతోన్నట్టు పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. బాల మురుగన్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వక్కంతం వంశీ కథ అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. నటీనటులు : గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు

Previous articleశ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ స్టంట్‌: కన్నబాబు
Next articleప్రకాష్ రాజ్ చేతుల మీదుగా “రుద్రాక్షపురం” ఫస్ట్ లుక్ రిలీజ్. వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here