Home తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలను గద్దె దించాలి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్...

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలను గద్దె దించాలి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పెంచిన పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా..

232
0

కరీంనగర్ సెప్టెంబర్ 30::
కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరు ఉద్యమించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పెంచిన పెట్రోల్..డీజిల్.. వంట గ్యాస్ ధరలకు నిరసనగా కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ తహశీల్దార్ జినుక జయంత్ కు వినతిపత్రం అందజేశారు.   ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఏడు సంవత్సరాల పాలనలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీనీ తుంగలో తొక్కి దేశంలోని నిరుద్యోగ యువకులను మోసం చేసిందని ఆరోపించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందని విమర్శించారు. రైతులు గత పది నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాడుతుంటే పట్టించుకోని నరేంద్ర మోడీ  రైతుల ఉద్యమాన్ని నిరంకుశంగా అణిచివేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి జాతి సంపదను మొత్తం కార్పొరేట్ కంపెనీ పెత్తందారులైన అంబానీ..ఆధానీ లకు, బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేయాలని చూస్తున్నాడని  మండిపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్,  నిత్యావసర సరుకుల ధరలను పెంచి పేద ప్రజలపై మరింత భారం మోపుతున్నాడని, మోదీ నిరంకుశ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు సీఎం కేసీఆర్ జీ హుజూర్ అంటూ మద్దతు నిస్తున్నాడని చెప్పారు. మోదీ.. కేసీఆర్ ఇద్దరిది ఫెవికాల్ బంధమని వీరి అనైతిక బంధానికి వ్యతిరేకంగా యువకులు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రహ్మాత్ హుస్సేన్,ఉప్పరి రవి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్,శ్రవణ్ నాయక్, మడుపు మోహన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పురం రాజేశం, లింగంపెళ్లి బాబు,కుర్ర పోచయ్య, లయిఖ్ ఖాద్రి, సత్యనారాయణ రెడ్డి, ఏజ్రా, సలీముద్దీన్, నిహాల్, హాజీ, విక్టర్,  సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ కుమార్, శోభారాణి, సురేందర్ రెడ్డి, సదాశివ, యుగంధర్, మణికంఠ రెడ్డి,గుడికందుల సత్యం, ఎడ్ల రమేశ్, సీపీఐ ఎంఎల్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Previous articleక్లీన్ ఇండియా క్లీన్ఆంధ్ర ప్రదేశ్
Next articleజగిత్యాల పట్టణ అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం ప్రజల భాగస్వామ్యం తోనే పట్టణాభివృద్ధి.. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, చైర్ పర్సన్ డా.భోగ.శ్రావణి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here