హైదరాబాద్ అక్టోబర్ 2
లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శనివారం నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహాత్ముడు జాతికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్ కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జీవన్ రెడ్డి, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు.