భద్రాచలం,
రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించాలని,వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని,అదే విధంగా వచ్చే యాసంగి పంటని కొనుగోలు చేసే విధంగా,రైతులకి భరోసా ఇవ్వాలని,రైతులని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ అధికారి కి వినతిపత్రం అందచేసారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం,తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్,పినపాక నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు వట్టం నారాయణ,కాకర్ల సత్యనారాయణ,కుంచాల రాజారామ్ తదితర నాయకులు పాల్గొన్నారు.