మంత్రాలయం
వైఎస్సార్ యంత్ర సేవ పథకం కింద మంజూరైన ట్రాక్టర్లను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి లబ్దిదారులకు శనివారం తమ స్వగ్రామమైన రాంపురంలో అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే ట్రాక్టర్ ను నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో ఆర్బీకేలను ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు, కేంద్రాల్లో రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి అవసరమైన వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
Home ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా ట్రాక్టర్ల మంజూరు ట్రాక్టర్ నడిపి లబ్దిదారులకు అందించిన...