కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీస్ కార్యాలయంలో నందు జిల్లా పోలీస్ సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారం కొరకు గ్రీవెన్స్-డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ హజరయ్యారు. అయన ప్రత్యక్షంగా సిబ్బంది నుండి అర్జీలను స్వీకరించారు. ఈ గ్రీవెన్స్ నకు జిల్లాలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది వారికి సంబంధించిన సర్వీసు, వెల్ఫేర్, ప్రమోషన్, బదిలీ తదితర అంశాలపై అర్జీలు వచ్యాయి. వాటిని సంబంధిత అధికారులకు, పరిపాలన విభాగ అధికారులకు ఎస్పీ పంపారు. సిబ్బంది సమస్యల సత్వర పరిష్కారం కొసం ఆదేశాలు, సూచనలు జారీ చేసారు.