నెల్లూరు
భారీ వర్షాలతో కోల్ కోత్త..చెన్నై నేషనల్ హైవే పై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. గూడురు వద్ద నేషనల్ హైవే పై వరద నీటి ప్రవాహం వాహానాలకు అడ్డంకిగా మారింది. దాంతో విజయవాడ, చెన్నై, తిరుపతి ల మధ్య రాకపోకలకు ఇబ్బందులెదురయ్యాయి. గూడూరు నేషనల్ హైవే పై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే అధారిటి ఆఫ్ ఇండియా నిర్లక్ష్యం పై వాహనదారులు మండిపడ్డారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ పోలయ్య గుంట ,బీసీ కాలనీ ,చవటపాలెం ,వేముల పాలెం ,శ్రామిక్ నగర్,రజక కాలనీ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు ఎగువ ప్రాంతం నుంచి మరింత ఎక్కువగా నీటి ప్రవాహం పెరిగితే పూర్తిగా నివాసాలు మునిగిపోయే ప్రమాదం ఉంది స్థానికులు మాట్లాడుతూ ఇందిరానగర్ పోలయ్య గంట ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది అని అధికారులు నీటిని పంపింగ్ చేసే ఏర్పాటు చేయాలని నష్టపరిహారం అందించాలని కోరారు