నెల్లూరు
నెల్లూరు జిల్లా,మనుబోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా బండే పల్లి గ్రామానికి చెందిన గుండాల వజ్రమ్మను, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా పిడూరు గ్రామానికి చెందిన తిక్కవరపు వెంకట రమణారెడ్డిని లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. తొలుత సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం ఆధ్వర్యంలో ఇక వైకాపా నాయకుల సమక్షంలో కోదండరాం పురంలో డి. ఎస్ .ఆర్ కళ్యాణమండపంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో 11 ఎంపీటీసీ సభ్యులు వైకాపా నేతల సమక్షంలో ఎంపీపీని ఎమ్మెల్యే ఖరారు చేసి ప్రకటించారు. ఈ విషయమై సంబంధించిన ఎంపీటీసీలు , స్థానిక వైకాపా నాయకులు ఎంపీపీ, ఉప ఎంపీపీ ప్రమాణ స్వీకార ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపిక కాబడిన మన మనుబోలు మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ , ఉపాధ్యక్షులు తిక్కవరపు రమణారెడ్డి లు మాట్లాడుతూ తమపై నమ్మకం అప్పగించిన పదవి బాధ్యతలు నిర్వహిస్తూ , మనుబోలు మండల అభివృద్ధికి , ప్రజాసంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని సంయుక్తంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు , మండల వైకాపా నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ మనుబోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా గుండాల వజ్రమ్మ ఎంపిక మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా...