Home తెలంగాణ హరీష్‌ రావు ఓ ఫకీరు : ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

హరీష్‌ రావు ఓ ఫకీరు : ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

89
0

హుజురాబాద్ అక్టోబర్ 22
రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హరీష్‌రావు ఓ ఫకీరు అని అరవింద్ అన్నారు. కొంగ లెక్క ఉన్న హరీష్‌రావు కొంగ కథలు చెప్తున్నాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓడిపోయే దగ్గరకు కేటీఆర్, కేసీఆర్ రారని, హరీష్ రావు అనే ఓ ఫకీరును పంపిస్తారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఫకీరు హరీష్ రావు ఓ  గ్యాస్ సిలెండర్ బుడ్డిని పట్టుకుని ప్రచారం చేస్తున్నాడన్నారు. ఆ సిలెండర్ గుర్తు ఇంకో అభ్యర్థిదని ఆయన వివరించారు.రాష్ట్రంలో అమలు చెయ్యని పథకాలను మ్యానిఫెస్టోలో ఎందుకు పెట్టినావని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. విధివిధానాలు లేకపోతే వాటిని పీకడానికి పెట్టినవా అని కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ బిడ్డ కవిత బంగారు చైన్‌లు ఎత్తుకుపోతుందని అరవింద్ ఆరోపించారు. దుకాణాలకు పోవడం, చైన్లు తీసుకోవడమే ఆమె పని అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.

Previous articleమిలాదున్నబీ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీలాద్ కమిటీ బాధ్యులు మౌలాన అలీమోద్దీన్ నిజామీ.. గులాం రబ్బానీ.. ఫరీద్ బాబా
Next articleఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు.. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here