కోరుట్ల అక్టోబర్ 18
కరీంనగర్ పట్టణంలోని కేఎస్ఎల్ కన్వెన్షన్ లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320జీ (ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల స్థాయి) లో జరిగిన “అభిగ్యాన్” వార్షిక అవార్డుల సదస్సులో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల 2020-21 లయనిస్టిక్ సంవత్సరానికి అందించిన సేవలకు గాను పలు విభాగాలలో అవార్డులు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్స్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ లయనిస్టిక్ సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ద్వారా కోరుట్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. క్లబ్ ద్వారా సుమారు 400 సిమెంట్ బెంచీలను వేయించడం, వాటర్ ప్లాంటులో కూలింగ్ యూనిట్ ప్రారంభచడం, అందత్వ నివారణ కార్యక్రమాలలో భాగంగా విజన్ సెంటర్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉచిత మోతె బిందు ఆపరేషన్స్ నిర్వహించడం, పలు రక్తదాన శభిరాలను నిర్వహించి రక్తదానాలను ప్రోత్సహించడం, కరోనా క్లిష్టమైన సమయంలో హోం ఐసోలేషన్ కిట్స్, మాస్కులు, సానిటైజర్లు,ఫేస్ షీల్డులు, కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు పీపీఈ కిట్లు ఉచితంగా వితరణ చేయడం, డయాబెటిస్ డిటెక్షన్
క్యాంపులు, హెల్త్ క్యాంపులు నిర్వహించడం అవసరార్థులను అందుకోవడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి లయన్స్ క్లబ్ యొక్క ప్రతిష్ఠ ను పెంచడం అభినందనీయమని అన్నారు. 2020-21 సంవత్సరానికి అధ్యక్షత వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల అధ్యక్షులు ప్రస్తుత జోన్ చైర్మన్ మంచాల జగన్, కార్యదర్శి కొమ్ముల జీవన్ రెడ్డి, కోశాధికారి గుంటుక మహేష్ లకు వ్యక్తిగత అవార్డులనే కాకుండా క్లబ్ కు బెస్ట్ పర్మినెంట్ ప్రాజెక్టు, బెస్ట్ బ్లడ్ డొనేషన్, బెస్ట్ డయాబెటిస్ అవేర్నెస్,బెస్ట్ ఇమేజ్ బిల్డింగ్ అవార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంచాల జగన్, కొమ్ముల జీవన్ రెడ్డి, గుంటుక చంద్ర ప్రకాష్, అల్లాడి ప్రవీణ్, పోతని ప్రవీణ్, ఎలిమిల్ల ఉషాకిరణ్, దండంరాజ్ స్వరాజ్, కనపర్తి రమేష్ (దుబాయ్ శీను)తదితరులు పాల్గొన్నారు