అమరావతి నవంబర్ 29
ఉద్యోగుల సమస్యలను ఏపీ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగులు కొంత ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ, ఇతర సమస్యలపై ఏపీ ఐక్యకార్యచరణ, ఏపీ ఐక్యకార్యచరణ అమరావతి ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సోమవారం స్పందించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.అనవసర రాద్దాంతం చేసేందుకే కొందరు ఆందోళన చేస్తున్నారని వెల్లడించారు. గ్రామ పంచాయతీ నిర్వహణ ఖర్చుల చెల్లింపునకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని, పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నాయని, ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు