మండల పరిధిలోని ఉప్పర్లపల్లె మరియు ఏర్రగుడి గ్రామ సచివాలయ పరిధిలోని అన్ని గ్రామాలలో శనివారం రోజున ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది.ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు మరియు బాలింతలకు,చిన్న పిల్లలకు జగనన్న కానుకలైన పాలు,గ్రుడ్లు,చిక్కిలు మరియు మొదలగు పౌష్టికాహారం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.ప్రభుత్వం ఉచితంగా అంగన్వాడీల ద్వారా ఉచితంగా అందించే పౌష్టికాహారం ద్వారా తల్లి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మహిళ పోలీసులు,అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.