కడప డిసెంబర్ 02
ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి దాటికి నిలిచిపోయిన దైవిక సేవలు, ఈ నెల నుండి తిరిగి వున ప్రారంభమయ్యాయని, విటిని విశ్వాసులు అందరు ఉపయోగించుకోవాలని ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ అబ్రహాం తెలిపారు. ఈ
సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ, గత ఏడాది మార్చి నుండి దూరమైన దేవుని దీవెనలు, కుటుంబాల సందర్శన, ప్రార్థన కూడికలు, యాత్రికుల సందర్శన, చర్చిలో బస, వివాహ శుభకార్యాలు వివిధ రకాల మొదలైన కార్యక్రమాలు యధా యధా
విధిగా జరుగునని ఈ సమాచారం మీచుట్టు ఉన్నవారితో పంచుకోవాలని ఆయన కోరారు. కరోనా ధాటికి, దేవుని సన్నిధికి దూరమై, సాతాను వడికి దగ్గరవుతున్న వేల తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు, ఆగమన కాలంలో క్రీస్తు జయంతి
కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో, కరోనా మహమ్మారి సంకెళ్ళను తెంచి, క్రీస్తు ప్రభువు సేవక రూపం దాల్చి మన చెంతకు వచ్చాడని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు సామాజిక దూరం తప్పనిసరిగా
పాటించాలని కోరారు. క్రీస్తు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.