కౌతాళం
అకాల వర్షానికి నదిపరివాహ ప్రాంతాల్లో కుంబలనూరు, నదిచగి, మెలిగానూరు, వల్లూరు, గుడికంబలి, తదితర గ్రామాల్లో భారీగా వరి పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అకాల వర్షానికి వరి చేలు నీట మునిగి కిందకు ఒరిగి పోయాయని భారీగా నష్టం వాటిల్లిందని చేతికొచ్చే పంట నష్టపోవడంతో రైతులు విలవిల లాడరు. ఈ కారణంగా అన్నదాతకు అపార నష్టం కలిగిందని సాగు చేసిన పంటలు వర్ష బీభత్సానికి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కోరారు ప్రతి నష్టపోయిన రైతుకు ప్రభుత్వమే భరించాలని నష్టపరిహారాన్ని అందించాలని సూచించారు.