Home ఆంధ్రప్రదేశ్ భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

256
0

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశ్రం జంక్షన్ వద్ద సోమవారం గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి సుమారు 50లక్షల విలువ చేసే 800ల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు . సాధారణ తనిఖీలలో భాగంగా ఆశ్రం ఆసుపత్రి సమీపంలోని జంక్షన్ వద్ద రూరల్ సిఐ అనసూయ శ్రీనివాస్ , ఎస్ఐ చావా సురేష్ లు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ లారీని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో గంజాయిని గుర్తించారు . నర్సీపట్నం నుంచి కర్ణాటక రాష్ట్రం కోలార్ తరలిస్తున్న సుమారు 50లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు . గంజాయి తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నాం అని వెల్లడించారు .

Previous articleఖమ్మం మున్నేరులో బయటపడ్డ శివపార్వతుల విగ్రహాలు
Next articleనటుడు ఉత్తేజ్ ఇంట విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here