నందవరం
రాష్ట్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడముతో చేతికొచ్చిన అన్ని రకాల పంటలు తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. నందవరం మండలం లో ప్రధాన పంట అయిన వరి పైరుకు వచ్చిన అగ్గి తెగులు తో రైతు తీవ్రంగా నష్టపోయి సంఘటన చోటు చేసుకుంది . నాడు అనావృష్టి తో రైతులు ఇబ్బంది పడితే నేడు అతివృష్టి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పత్తి, మిరప తదితర చేతి కొచ్చిన పంటలు నాశనం కావడంతో రైతులు విలవిల పోతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు కన్నీటి గాధ కొరకరాని కొయ్యగా మారిందని రైతులు ఆవేదన చెందారు. చేసిన పంట అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని రైతులు తలలు బాదుకుంటున్నారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా అందించే నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
Home ఆంధ్రప్రదేశ్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు తడిసిన పంటలు భారీ వర్షాలతో నట్టేటమునిగిన రైతన్న