జగిత్యాల సెప్టెంబర్ 15
జగిత్యాల పట్టణంలోని రాంబజార్ ప్రాంతంలో భారీ వాహనాలతో వ్యాపారులు, వాహన చోదకులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో అతి పెద్ద వ్యాపార కేంద్రమైన రాంబజార్ ఏరియాలోని కొందరు వ్యాపారులకు అక్కడే గోదాములు ఉండడం వల్ల దిగుమతి చేసుకునే సామాగ్రిని తేచ్చే ట్రాన్స్పోర్ట్ భారీ వాహనాలతో వాహనచోదకులకు ముఖ్యంగా ఉదయం పూట తీవ్ర అసౌకర్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల పట్టణం లోపల భారీ వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టిన ఉదయం పూట రాంబజార్ లోనికి భారీ వాహనాలు రావడంతో రోడ్డుపై ప్రతి రోజు ప్రయాణాలు ఇబ్బందిగా మారిందని పేర్కొంటున్నారు. రోజు ఈ రహదారి పై ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ట్రాఫిక్ నియంత్రణకు జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నియమించే ఆలోచనను చేపట్టక పోవడం పట్ల వాహన చోదకులు ట్రాఫిక్ పోలీస్ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.