Home తెలంగాణ తెలంగాణా సరిహద్దుల్లో హైఅలర్ట్

తెలంగాణా సరిహద్దుల్లో హైఅలర్ట్

393
0

భద్రాచలం
తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో సోమవారం తుపాకులు గర్జించాయి. అటవీప్రాంతం రక్తసిక్తమైంది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతదేహాలతోపాటు ఆయుధాలను సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లభ్యమైన ఆయుధాలను బట్టి కీలకమైన నేతలుగా పోలీసులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో సరిహద్దు తెలంగాణ ప్రాంత పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు చికిత్స కోసం తెలంగాణకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే నిఘావర్గాల సూచనతో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పోలీసులు ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అటు ములుగు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు

Previous articleహుజురాబాద్ లో గెల్లు గెలుపు ఖాయం కేసీఆర్
Next articleపాదయాత్ర ద్వారా కలెక్టరేట్ ముట్టడి ధర్నా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here