Home తెలంగాణ సిద్దిపేట్ కలెక్టర్ పై హైకోర్టు ఫైర్

సిద్దిపేట్ కలెక్టర్ పై హైకోర్టు ఫైర్

128
0

హైదరాబాద్ నవంబర్ 2
యాసంగి వరి విత్తనాల అమ్మకాలపై సిద్దిపేట కలెక్టర్ చేసిన వాఖ్యలపై హైకోర్టు విచారణ నిర్వహించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్  వాదనలు వినిపించారు. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబిషన్ యాక్ట్‌ లో ఏమైనా చేర్చరా అని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటిది ఏమీ లేదని ఏజి బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. అలాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. రైతుల విషయంలో కలెక్టర్ అలా ఎలా వ్యాఖ్యలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కలెక్టర్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Previous articleపాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పించాలి ముఖ్యమంత్రి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ
Next articleఅచ్చెన్నాయుడిని అడ్డుకున్నపోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here