Home తెలంగాణ తైవాన్ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

తైవాన్ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్

152
0

హైద‌రాబాద్ సెప్టెంబర్ 30
తైవాన్ పెట్టుబడుల‌కు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – క‌నెక్ట్ తెలంగాణ స్టేట్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మ‌రింత‌ ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా కేటీఆర్ ఇప్పటిదాకా తెలంగాణ – తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం గ‌తంలో ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తైవాన్ దేశానికి సంబంధించిన టీసీఏ  తో టెక్నాలజీ పార్ట్‌న‌ర్‌షిప్‌ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ దర్భంగా గుర్తు చేశారు.

Previous articleరాజ‌స్థాన్‌లోనీట మునిగిన సంగమేశ్వ‌ర ఆల‌యం
Next articleఐఎస్ఎల్ 2021-22 కి సరికొత్త కిట్ను విడుదల చేసిన హెచ్ఎఫ్సి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here