Home ఆంధ్రప్రదేశ్ అక్టోబ‌రు 2 నుండి 4వ త‌దీ వ‌ర‌కు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

అక్టోబ‌రు 2 నుండి 4వ త‌దీ వ‌ర‌కు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

97
0

తిరుపతి,మా ప్రతినిధి,సెప్టెంబర్ 30,
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం అక్టోబ‌రు 1న సాయంత్రం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది.

యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల  తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబరు 2న పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబరు 3న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబరు 4న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది.  ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు.

Previous articleఅక్టోబర్ 22న థియేటర్లలో “మిస్సింగ్” రిలీజ్
Next articleరాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here