కడప
కడప తాలూకా పరిధిలో బుగ్గవంక పరివాహక ప్రాంతం శాస్త్రి నగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయిన వృద్ధ మహిళను హోమ్ గార్డ్ రమేష్ (హెచ్.జి 208) కాపాడాడు. రమేష్ సాహసోపేతంగా వెళ్లి నీటిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించాడు. బాధితులను ఆటోలో సురక్షిత ప్రాంతానికి తరలించాడు. బాధితులు కడప జిల్లా పోలీసు శాఖ కు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ సేవలను స్థానికులు కొనియాడారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ హోమ్ గార్డు రమేష్ ను అభినందించారు.