నంద్యాల ఎమ్మెల్యే
నంద్యాల
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ని నంద్యాల ముస్లిం మైనార్టీ జేఏసీ సభ్యులు ఆయన స్వగృహంలో శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఉర్దూ కళాశాల లోని ఉపాధ్యాయులకు వేతనాలు ప్రభుత్వం నుంచి అందడం లేదని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి విన్నవించుకోగా తక్షణమే అధికారులతో మాట్లాడతానని అంతవరకూ నా సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా తోందరలో పరిస్కరిస్తానని వారికి హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యమ్ యల్ సీ ఈషాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మా భున్నిసా,వైసీపీ నాయకులు ముస్లిం జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.