Home ఆంధ్రప్రదేశ్ వై.ఎస్.ఆర్.సి.పి, బి.జె.పి ల మధ్య వాడి వేడి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఈనెల 27...

వై.ఎస్.ఆర్.సి.పి, బి.జె.పి ల మధ్య వాడి వేడి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఈనెల 27 న ముగియనున్న ఎన్నికల ప్రచారం

92
0

కడప బద్వేలు ఉప ఎన్నికల ప్రచారం గడువు ఇక  మూడు రోజులు మాత్రమే వుంది. దీంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో  వై.ఎస్.ఆర్.సి.పి, భారతీయ జనతాపార్టీ నాయకుల మధ్య వాడి వేడి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ప్రచారం సాగుతోంది. వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలను, తెదేపా కార్యకర్తలను బి.జె.పిలో చేర్పించేందుకు ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు.  ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.  ఎన్నికల పోలింగ్ కు సమయానికి 72 గంటలు ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాల్సి వుంటంది. దీంతో  ఎన్నికల ప్రచారం గడువు ఈ నెల 27వ తేదీ సాయంత్రం తో ముగియనుంది.    వై.ఎస్.ఆర్.సి.పికి చెందిన  బద్వేలు(ఎస్సీ) నియోజకవర్గ ఎమ్మెల్యే జి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి  28న మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే జి వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ పోటీ పడుతున్నారు.  దివంగత ఎమ్మెల్యే సతీమణికే పార్టీ టికెట్ కేటాయించడంతో సంప్రదాయంగా పోటీ చేయడం లేదని తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రకటించిన విషయం విధితమే. భారతీయ జనతాపార్టీ తరపున పి సురేష్, కాంగ్రెస్ పార్టీ తరపున  మాజీశాసన సభ్యురాలు పి.ఎం కమలమ్మ పోటీ చేస్తున్నారు.  ముగ్గరు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలుపుకొని మొత్తం 15 మంది ఎన్నికల బరిలో వున్నారు.    వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయానికి రాష్ర్ట పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించారు. ఈయన ఆధ్వర్యంలో  రాష్ర్ట మంత్రులు ఎస్.బి అంజాద్ బాష, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ జి శ్రీకాంత్ రెడ్డి, కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి,  కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నాయకులు గత కొన్ని రోజులుగా మాకం వేసి
ఎన్నికల వ్యూహాలను పన్నుతున్నారు. ప్రతి రోజూ నియోజకవర్గంలోని 7 మండలాల్లోని నాయకులు, కార్యకర్తలతో  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు, భారతీయ జనతాపార్టీ నాయకుల మధ్య వాడి వేడి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు మధ్య ఎన్నికల ప్రచారం హోరు ఎత్తుతోంది. ఇప్పటికే భారతీయ జనతాపార్టీ రాష్ర్ట అధ్యక్షులు సోమువీర్రాజు బద్వేలు నియోజకవర్గంలో గత వారం రోజులుగా తిష్ట వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కె మురుగన్, రాష్ర్ట పార్టీ వ్యవహారాల ఇన ఛార్జ్  సునీల్ దేవదర్, జనసేన నాయకులతో పాటు మాజీమంత్రి సి ఆదినారాయణరెడ్డి, పార్టీ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు సి ఎల్లారెడ్డి, ఎన్ రమేష్ లతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  సోము వీర్రాజు  మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన పై చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఎం కమలమ్మకు మద్దతుగా ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు సాకే శైలజానాథ్, పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్స్ మస్తాన్ వల్లి, ఎన్ తులసిరెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.       బద్వేలు అసెంబ్లీ ఎన్నికల ఇన్ ఛార్జ్, రాష్ర్ట మంత్రి పి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  భారీ మెజార్టీ సాధించేందుకు వ్యూహం పన్నుతున్నారు.   2019 అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య 44 వేల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో నవరత్నాలు అమలు చేయక పోయినా వెంకట సుబ్బయ్య భారీ మెజార్టీతో గెలుపొందారని, ప్రస్తుతం అధికారంలోకి రావడంతో నవరత్నాలు అమలు చేస్తున్నామని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులు పార్టీ యంత్రాగానికి దిశ నిర్దేశం చేస్తున్నారు. దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది జగనన్న కానుకగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒంటికి ఒకటికి నాలుగుసార్లు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అందుతున్నాయా లేదా ఆని ఆరా తీసి, సంక్షేమ పథకాలకు సంబంధించి వివరించి ప్రజలకు ఓట్లు అడగాలని కార్యకర్తలకు పేర్కొంటున్నారు. మరో ప్రక్క బి.జె.పి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  రాష్ర్ట విభజన సమస్యలు
పరిష్కరించడంలో విఫలమైందని, జిల్లాలో ఉక్కుకర్మాగారం నిర్మించాలేదని, రాష్ర్ట అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ప్రచారం చేస్తున్నారు.        బి.జె.పి నాయకులు జిల్లాలో అమలు అవుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు అవుతున్నాయని, వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు వారి పార్టీ స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకొంటున్నారని విమర్శిస్తున్నారు. బద్వేలు అభివృద్ధికి తమ పార్టీ కృషి చేస్తోందని
పేర్కొంటున్నారు.  సోము వీర్రాజు మాట్లాడుతూ బద్వేలులో ప్రలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా వున్నాయని, నీటి కోసం నిధులు వచ్చాయని, వాటిని వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. బద్వేలు బస్తీలా లేదని,  గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ పడుతున్నారన్నారు. టీడీపీ శ్రేణులను కలిసి వారికి ఉన్నత పదవులు ఇస్తామని, ఎన్నికల్లో సహకరించాలని మంత్రులు  ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఓటర్లను వాలెంటీర్ల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.  బద్వేలు అభివృద్ధి పై మంత్రి పెద్దిరెడ్డి చర్చకు  రావాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొంటామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను నియమిస్తామని ప్రకటించారు.    మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఎం కమలమ్మకు మద్దతుగా ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు సాకే శైలజానాథ్ బద్వేలులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Previous articleజిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.నిశ్చల్
Next articleఛత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు…ముగ్గురు మావోయిస్టులు హతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here