కొట్టాయం అక్టోబర్ 18 కేరళలో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నది. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదిలో వరద ఉధృతివల్ల ఆదివారం సాయంత్రం కొట్టాయం జిల్లాలో ఓ నది ఒడ్డున ఉన్న ఇల్లు అమాంతం వరదలోపడి కొట్టుకుపోయింది.ఇల్లు నదిలోపడి కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు చూస్తూ నిలబడిపోవడం తప్ప మరేమీ చేసే అవకాశం చిక్కలేదు.