హైదరాబాద్
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి లోనీ రాహుల్ కాలనీలో నివాసం ఉంటున్నగృహిణి షబా (31) గృహిణి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఆర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి శబా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. అక్కడే దొరికిన సూసైడ్ లెటర్ ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు