
చెన్నై నవంబర్ 1
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మానవత్వాన్ని ప్రదర్శించారు. కాన్వాయ్‌ను ఆపేసి.. అంబులెన్స్‌కు సీఎం స్టాలిన్ దారిచ్చారు.కోయంబత్తూరు-వెలచెరి రూట్లో సీఎం కాన్వయ్ వెళ్తున్న సమయంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వచ్చింది. అయితే వేగంగా వెళ్తున్న ఆ అంబులెన్స్ కోసం సీఎం స్టాలిన్ వాహనశ్రేణి దారిని ఇచ్చింది. ఎడమ వైపు కాన్వాయ్‌ను ఆపి .. అంబులెన్స్‌కు మార్గాన్ని కల్పించారు. మార్ మధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనేక మంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఇటీవల సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. ఎవరూ కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవద్దు అన్నారు. స్టాలిన్ వాహనశ్రేణిలో రెండు పైలెట్ వాహనాలు, మూడు ఎస్కార్ట్ వాహనాలతో పాటు ఓ జామర్ వాహనం ఉంటుంది. స్టాలిన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తున్నారు. సీఎం కాన్వాయ్‌లోని అడ్వాన్స్ పైలెట్ వాహనం వెళ్లిన తర్వాత అయిదు నిమిషాల ముందు మాత్రమే ట్రాఫిక్‌ను ఆపనున్నారు. ఇవాళ ఉదయం సీఎం స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైలో ఇవాళ్టి నుంచి స్కూళ్లు ఓపెన్ చేస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బడులు తెరిచారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.