కడప నవంబర్ 25
వర్షానికి భీభత్సంగా మారిన మందపల్లి, నందలూరు మండలము,తొగురు పేట గ్రామాల్లో మానవతా సభ్యులు పర్యటించారు. మానవతా వ్యవస్థాపకులు ఎన్.రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజున మానవతా సభ్యులు విస్తృతంగా పర్యటించి 115000 రూపాయల విలువైన దుస్తులు,కిరాణా పంచిపెట్టారు. బాధితులు తమ గోడు మానవతా సభ్యుల ఎదుట విలపించారు. కూడు గూడు గుడ్డ కొల్పోయామని ప్రభుత్వం రక్షణ కల్పించేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మానవతా సభ్యులను కోరారు. తమ పై దయ చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు రాటాల రవి, సుబ్రహ్మణ్యం,పూర్వ ప్రధానోపాధ్యాయులు కల్లూరు బాల ఎల్లారెడ్డి, వీరారెడ్డి సత్యనారాయణ వెంకటసుబ్బయ్య మిత్రబృందం మానవతా స్వచ్ఛంద సేవా సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.