హైదరాబాద్
హుజురాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక అని,పేపర్లలో వచ్చిన వార్తలను బట్టి ఒక లక్ష 50 వేల మందికి 3 గంటల్లో 90 కోట్ల రూపాయలను పంపిణీ చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ తెలిపారు.గురువారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లడుతూశశాంక్ గోయల్ అధికారులకు చెప్పక ముందే అన్ని పనులు అయిపోయాయన్నర్టు.ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తున్నాం.. ఎన్నికల కమిషన్ ను ఇప్పటికైనా ఒక సీనియర్ అధికారిని పంపించి చర్యలు తీసుకోవాలని కోరారు.మొన్న కేసీఆర్ ఒక సీఎం గా ఎన్నికల కమిషన్ ను హెచ్చరించారు. శశాంక్ గోయల్ ఆ మాటలు విన్న కూడా ఏమి చేయలేదు.ఎన్నికల ప్రధాన అధికారి యే ఏమి చేయకపోతే ఇక జిల్లా స్థాయి అధికారులు ఏమి చేస్తారన్నారు.ఏమి చేసినా మీరు కళ్ళు మూసుకొని ఉండాలని కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించారని,5 నెలలుగా హుజురాబాద్ లో అడ్డగోలు అధికార దుర్వినియోగం చేశారన్నారు.మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా రుణ మాఫీ చెక్ లు ఇచ్చామని చెప్పారు, రామాలయం, దర్గా లకు నిధులు ఇస్తామని చెప్పారు.3 వేల మంది రాష్ట్ర పోలీసులు, 1800 మంది కేంద్ర పోలీసులు ఉన్నారు. 3 గంటల్లో 90 కోట్ల రూపాయలు పంచితే పొలీస్ లు ఏం చేస్తున్నారు.ఇప్పటికైనా కేంద్రం ఒక ఉన్నతాధికారి ని నియమించి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసారు.