Home ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి లేనే లేదు.. తేల్చిచెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

రాజకీయాలపై ఆసక్తి లేనే లేదు.. తేల్చిచెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

126
0

విశాఖపట్టణం నవంబర్ 23
ఈ క్రమంలోనే రాజకీయాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేనే లేదని తేల్చిచెప్పారు. వాటి మీద తాను అసలు మాట్లాడను అని.. ఇక మీదట ఆ రంగంలోకి రాను అంటూ స్పష్టంగా చెప్పేశారు.బీజేపీ జాతీయ రాజకీయాలను ఊపు ఊపిన వెంకయ్య నాయుడు ఇప్పుడు మోడీ షాల రాకతో లూప్ హోల్ లోకి వెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతిగా నియామకం అయ్యి ఉత్సవ విగ్రహంగా మారారు. అయితే నేటి రాజకీయాలకు ఆయన కన్వర్ట్ కాలేదు. బీజేపీ పెద్దలందరినీ సైడ్ చేసినా మోడీ షాలు వెంకయ్యను కూడా ఉపరాష్ట్రపతిగా పంపి మమ అనిపించారు.విశాఖపట్నంలో తాజాగా పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా వర్ధమాన రాజకీయాల మీద తన భావాలపై ఓపెన్ గా మాట్లాడారు. రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల తీరు పూర్తిగా మారాలని ఆయన కుండబద్దలు కొట్టారు.ఏపీ అసెంబ్లీ తీరుపై పరోక్షంగా వెంకయ్య విసుర్లు విసిరారు. చట్టసభల్లో నాణ్యమైన చర్చలు అర్థవంతంగా జరగడం లేదని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.ఒకనాటి రాజకీయ నేతగా తాను ఈ పరిణామాల పట్ల ఆవేదన చెందుతున్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి ఉంటేనే శాంతి ఉంటుందని వెంకయ్య వ్యాఖ్యానించడం విశేషం. ప్రజలూ అభివృద్ధినే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.మొత్తానికి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ మేధావి వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Previous articleవైఎస్ వివేకా హత్య కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు
Next articleగంజాయి సరఫరా చేసే నిందితుడు అరెస్ట్ – కిలో 300 గ్రాముల గంజాయి స్వాధీనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here