నంద్యాల
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు విలేకరుల సమావేశంలో భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల లో అభివృద్ధి పనులకు నేను ఎప్పుడూ అడ్డుపడలేదని ఆయన అన్నారు. వైయస్ అర్ సీ పీ పార్టీ వారు అనవసరంగా తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. నేను ఒకటిన్నర సంవత్సరం లో నంద్యాల లో ఏమి అభివృద్ధి చేసేనో మీరు ఓస్తే చూపెడతానని ఆయన అన్నారు. మీరు రెండున్నర సంవత్సరాలలో ఏమి అభివృద్ధి చేశారో చూపెట్ట గలరా అని అన్నారు. భూమ నాగిరెడ్డి నంద్యాల పేదల కోసం టిడ్కో గృహాల ను మంజూరు చేయించి పట్టాలు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని అన్నారు . మిమ్మల్ని ప్రజలు పట్టాలు ఎప్పుడు పంచు తారని అడిగితే తెలుగుదేశం పార్టీ వారు కేసు వేశారని తప్పించు కోవడం మీ చేత గాని తనానికి నిదర్శనం అని అన్నారు. కేసు వేచిన వారితో ఇరువరం పొయ్యి విత్ డ్రా చేపిస్తాము మీరు వస్తారా అని అన్నారు. మెడికల్ కాలేజీని మేము ఎప్పుడూ వద్దన లేదని అన్నారు. ఆ ప్రాంతం వంద సంవత్సరాల క్రితం నుంచి రైతులకు ఉపయోగపడు తుందని అటువంటి చోట నిర్మాణం చేయడం మంచిది కాదని అన్నామనీ అంతే గాని వద్దు అనే మాట ఎప్పుడు ఎక్కడ అనలేదని తెలిపారు . నంద్యాల చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్థలం లో నిర్మించ వచ్చు కదా అని అన్నారు. లేదా ప్రైవేటు స్థలంసేకరణ చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. చేత కాక పొయేది ప్రతి ఒక్కటీ తెలుగుదేశం పార్టీ అడ్డు పడుతున్న దని అనడం ఫ్యాషన్ గా మారింది అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.