Home తెలంగాణ పోషక విలువల తో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వప్న

పోషక విలువల తో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వప్న

126
0

జగిత్యాల సెప్టెంబర్ 13
పోషక విలువల తో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వప్న సూచించారు.సోమవారం
జగిత్యాల పట్టణ ఎన్సీఎల్పీ అంగన్ వాడి  కేంద్రంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు సీమాంతలు నిర్వహించారు. ఈ సందర్భంగా
ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వప్న మాట్లాడుతూ గర్భిణులు, తల్లులు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోతే రక్తహీనత వస్తుందని, గర్భిణులు బిడ్డ పుట్టిన రెండేండ్ల వరకు బిడ్డకు తల్లి పాలు తాగించాలన్నారు. ముర్రుపాల విశిష్టత ను వివరించారు. అనంతరం అంగన్ వాడి కేంద్ర పరిధిలోని గర్భిణులకు సీమంతాలు చేశారు.
ఈ పోషణ మాసోత్సవాల్లో భాగంగా తల్లులు, పిల్లల పర్యవేక్షణ గురించి అవగాహన కల్పిస్తారని, కేంద్రాల్లో పిల్లలకు సంబంధించి ఎత్తు, బరువు కొలతలు చూడటం జరుగుతుందని అంగన్ వాడి టీచర్లు తెలిపారు. అంతేకాకుండా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం గురించి తల్లులకు తెలియచేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకుని పిల్లల ఎదుగుదలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రిజ్వానా బేగం, షాహిన సుల్తానా, జె. తిరుమల దేవి, గర్భిణులు
ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Previous articleషఫీ నగర్ ల్యాండ్ యొక్క ATV ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ – ఆకాసం టీవీ నన్ను 25 లక్షలు అడిగింది – కేబుల్ రమేశ్
Next article108 లో ప్రసవం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here