Home వార్తలు డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ విడుదల

డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ విడుదల

242
0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు రికార్డులను తిరగ రాశాయి. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టీజర్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. డిసెంబర్ 17న పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పుష్ప థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
నటీనటలు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు
====================

Previous articleఐశ్వర్య ఆర్‌. ధనుష్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ స్ట్రయిట్‌ తెలుగు సినిమా
Next articleరవితేజ, త్రినాథరావు నక్కిన, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్‌ ప్రాజెక్ట్ అక్టోబర్ 4న ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here