Home తెలంగాణ ప్రసూతి సేవల్లో ఆదర్శం.. సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో...

ప్రసూతి సేవల్లో ఆదర్శం.. సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 324 ప్రసవాలు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు

155
0

రాజన్న సిరిసిల్ల
ఒకప్పుడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సర్కారు దవాఖానలో వైద్యం కోసం వెళ్ళాలంటే వైద్యులు, సిబ్బంది పట్టించుకోరు, కనీస సౌకర్యాలు ఉండవు అనే భావనతో, అప్పు చేసి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో సర్కారు దవాఖానల రూపు రేఖలు మారిపోయాయి. వైద్యులు, సిబ్బంది, మౌళిక వసతులు, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తుంది. మంత్రి కె. తారకరామారావు మార్గదర్శనంలో, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అధునాతన సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు, ఇతర రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఈ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో  నవంబర్ నెలలో ప్రసవాలు జరిగాయి. ఈ నెలలో ఏకంగా 324 ప్రసవాలు చేసి వైద్యులు, సిబ్బంది తమ విధులపట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. ఇందులో 98 సాధారణ ప్రసవాలు ఉన్నాయి. అక్టోబర్ లో 303 ప్రసవాలు జరగగా, ప్రతి నెల సగటున 290 నుండి 300 వరకు ప్రసవాలు జరుగుచున్నాయి.  మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవ తీసుకుని అధునాతన వైద్య పరికరాలను సమకూర్చి, గైనకాలజిస్టులను కరీంనగర్ నుండి డిప్యూటేషన్ మీద ఆసుపత్రికి తీసుకువచ్చి పగలుతో పాటు, రాత్రి వేళల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించి ప్రసవాలు చేయడంలో సఫలం అవుతున్నారు. మిడ్ వైఫరీ ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది ప్రత్యేకంగా బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసవం తర్వాత వారు తక్కువ సమయంలోనే తిరిగి సాధారణంగా కోలుకునేలా వారికి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ, మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. సీటిజి మెషీన్, ఫీటల్ డాప్లర్, అల్ట్రా సౌండ్ మెషీన్, అధునాతన ల్యాబరేటరీ రూమ్, హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుళ్లతో పాటు బాలింతలకు అందించే కేసీఆర్ కిట్, ఇతర సదుపాయాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం ఉంచి, వైద్య సేవల కోసం ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలు వస్తున్నారని ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు తెలిపారు. నిపుణులైన వైద్యులు, మిడ్ వైఫరీ నర్సులు, అధునాతన పరికరాలు ఆసుపత్రిలో ఉన్నాయన్నారు.  కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదవారు ప్రసవాలు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, పూర్తి ఉచితంగా సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు

Previous articleవిద్యార్థులందరికీ ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ యం. హనుమంత రావు
Next article‘రాధే శ్యామ్’ నుంచి ‘నగుమోము తారలే’ రొమాంటిక్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here