లక్నో నవంబర్ 20
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో జరిగే డీజీపీలు, ఐజీల సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావొద్దని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇదే విషయమై తాను ప్రధాని మోదీకి లేఖ కూడా రాశానని చెప్పారు. రైతుల విషయంలో ప్రధాని నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే.. లఖింపూర్ ఖేరీలో రైతులను కారుతో తొక్కించిన నిందితుడికి తండ్రి అయిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాతో వేదికను పంచుకోవద్దని అన్నారు.లఖింపూర్ ఖేరిలో మరణించిన రైతుల కుటుంబాలు తమకు న్యాయం జరుగాలని కోరుకుంటున్నాయని, కానీ నిందితుడి తండ్రి అజయ్ మిశ్రా ఇంకా కేంద్రమంత్రిగా కొనసాగుతుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. అదేవిధంగా ప్రధాని మోదీకి రైతులపట్ల ఏమాత్రం కనికరం ఉన్నా.. ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. మృతుల కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Home జాతీయ వార్తలు రైతుల విషయంలో ప్రధాని నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే.. డీజీపీలు, ఐజీల సదస్సుకు...