నంద్యాల నవంబర్ 19
పగిడ్యాల మండలం లో నాటు సారా తెలంగాణ అక్రమ మద్యం వ్యాపారం చేస్తే తాట తీస్తాం అని ముచ్చుమర్రి ఎస్ఐ నాగార్జున గురువారం నాడు పగిడ్యాల మండలం లోని అక్రమ మద్యం నాటుసారా వ్యాపారులు అనే అనుమానితులను ముచ్చుమర్రి స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ లో జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎస్సై నాగార్జున ఆధ్వర్యంలో నాటుసారా, మద్యం విక్రయాలు జరిపే వారికి సూచనలు అవగాహన కల్పించారు. స్థానిక ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రాతకోట, నెహ్రూ నగర్, పగిడ్యాల, గ్రామాలకు చెందిన పలువురికి ఆయన
గురువారం ముచ్చుమర్రి స్టేషన్ లో కౌన్సెలింగ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై నాగార్జున మాట్లాడుతూ.. స్థానిక ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం తెలిస్తే ఎస్సై నాగార్జున 91211 01188 కు తెలపాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తప్పుడు వ్యాపారాలు చేసి తమరు ఇబ్బంది పడేది కాకా. తమ పై ఆధారపడి బతికే కుటుంబ సభ్యులు. పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడాల్సి వస్తుందని కావున ప్రతి ఒక్కరూ సాధక బాధలను గుర్తించి సువిశాలంగా జీవించాలని మిర్చి మరియు ఎస్సై నాగార్జున వివరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.