Home ఆంధ్రప్రదేశ్ వాహనదారులు నుండి అక్రమ వసూళ్లు. వసూళ్లకు అడ్డాగా నాయుడుపేట . పూతలపట్టు బైపాస్ సర్కిల్...

వాహనదారులు నుండి అక్రమ వసూళ్లు. వసూళ్లకు అడ్డాగా నాయుడుపేట . పూతలపట్టు బైపాస్ సర్కిల్ ప్రజలను నిలువుగా దోచుకుంటున్న వైనం దోచిన వారు తోచినట్టుగా- నామమాత్రంగా సీసీ కెమెరాలు పట్టించుకోని సంబంధిత అధికారులు

121
0

నాయుడుపేట బైపాస్ నాలుగు రోడ్ల కూడలి వద్ద ప్రజలను, వాహనదారులను, వివిధ వాహనాలను ఆపి వారి వారికి తోచినట్లు  వసూలు చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  బైపాస్ రోడ్డు నాలుగు రోడ్లు సర్కిల్  చెన్నై వైపు, నాయుడుపేట వైపు, శ్రీకాళహస్తి వైపు, తిరుపతి వైపు నిత్య వాహనాలు వెళ్తూ ఉంటాయి.  బైపాస్ రోడ్ సర్కిల్ వద్ద మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ , అటవీశాఖ చెక్ పోస్ట్ , కూతవేటు దూరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఆపి సీసీ కెమెరాలకు కనిపించకుండా మోటుగా మార్కెట్ యార్డ్, అటవీశాఖ అధికారులు తో పాటు కొంతమంది పోలీస్ సిబ్బంది వారికి ఇష్టం వచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  వీరి దోపిడీ గురించి ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  టూ టౌన్ పరిధిలో బైపాస్ రోడ్డు సర్కిల్ ఉంది.  అయితే ఇక్కడ ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాల పంపాల్సిన బాధ్యత టూ టౌన్ పోలీస్ అధికారులపై ఉంది. అయితే అధికారులు ఏమీ పట్టించుకోకుండా   భారీ వాహనాలు అక్కడ నిలుపుకునేందుకు వారి వద్ద నుంచి కొంత మంది పోలీస్ సిబ్బంది చేతివాటం  చూపిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఈ సర్కిల్ వద్ద ప్రతిరోజు పాల వ్యాను వాహనాలు లోడింగ్,  అన్లోడింగ్ చేసుకుంటూ ఉంటారు.  ట్రాఫిక్ అంతరాయం  కలిగించే పాల వాహనాల గురించి మాత్రం పట్టించుకోరు.
ప్రతి నెల పోలీస్ స్టేషన్ కు పాల  వ్యాపారి నుంచి భారీ స్థాయిలోనే  స్టేషన్ మామూలు వసూలు చేసుకుంటున్నారనే విమర్శలు  వ్యక్తమవుతున్నాయి.  టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే కొంత మంది పోలీస్ సిబ్బంది నిత్యo వాహనాలను ఆపి మామూళ్లు వసూలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఆప నటువంటి  వాహనాలను కూడా వెంబడించి మరీ వసూలు చేస్తున్నారని పలువురు వాహనదారులు వాపోతున్నారు.   నిత్యం వీరు  టింబర్ డిపోలు,  పెట్రోల్ బంకులు, పలు షాపుల్లోనూ రోజువారి మామూళ్ళు తీసుకుంటున్నా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.  ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ప్రజలకు సేవ చేయాల్సిన టువంటి సిబ్బందే నిత్యం   వారు వేధించి వసూళ్లకు పాల్పడడం  పలు విమర్శలకు తావిస్తోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  చర్యలు తీసుకుంటారో  లేదో వేచి చూడాల్సిందే.

Previous articleఎంపీ ధర్మపురి అర్వింద్ రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ,ధర్నా, రాస్తారోకో
Next articleఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్‌, సంపత్ నంది, శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ చిత్రం ‘సీటీమార్‌’ సన్సార్ పూర్తి వినాయక చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10 రిలీజ్‌కు స‌ర్వం సిద్ధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here