Home ఆంధ్రప్రదేశ్ నాల లో అక్రమ లే అవుట్… కుడా .వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి...

నాల లో అక్రమ లే అవుట్… కుడా .వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అధికారులమీద ఫైర్

74
0

నంద్యాల
నంద్యాల అధికారుల పనితీరుపై కూడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అసంతృప్తి  వ్యక్తం చేశారు.  అనుమతి లేని ప్లాట్స్ కొనొద్దని అధికారుల విజ్ఞప్తి చేసిన కూడా అక్రమార్కులు ప్లాట్ల ను కొంటున్నారంటే అధికారుల అవినీతి కారణంగా ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. .
..కుడా అధికారుల చర్యలతో అక్రమమార్కుల వెన్నులో చలి. అక్రమ వెంచర్ దారుల్లో కుడా అధికారులు వెన్నులో చలిపుట్టించారు.అక్రమ లే అవుట్ లలో నిర్మాణాలు సాగిస్తే కఠినచర్యలతోపాటు,నిర్మాణాలు తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారిచేస్తున్నారు. నంద్యాలలో పనిచేస్తున్న అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నంద్యాల మండలం కానాల లో అక్రమ లే అవుట్ లపై కుడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి,ఏ సీపీ సంధ్య,డి.ఎల్.పి.ఓ శ్రీనివాసరావు,సర్పంచ్ మరికొందరు సోమవారం లోపు అక్రమ లే అవుట్ పూర్తిగా తొలగించాలని డెడ్ లైన్ పెట్టారు.తొలగించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ లే అవుట్లు రిజిస్టర్ కాకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు కొందరుడిఆర్,డిఐజి దృష్టికి తీసుకొనిపోయారు.పెద్ద ఎత్తున అక్రమ వెంచర్ అయిన చర్యలు తీసుకోకపోవడంతో నంద్యాల అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.ప్రధానంగా రహదారిలేకుండా ప్లాట్స్ వేయడంపై ఆక్షర్యం వ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వ స్థలంలో రహదారి ఏర్పాటు చేయడంపై నంద్యాల అధికారులను కర్నూల్ కుడా అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.వక్ఫ్ స్థలం అక్రమనపైన వక్ఫ్ అధికారులదృష్టికి కుడా అధికారులు తీసుకొనివెళ్లినట్లు సమాచారం.అనుమతులు లేని ప్లాట్స్ కొనవద్దని అధికారులు చెబుతున్నారు. .

Previous articleభారత భూభాగంలో అక్రమంగా గ్రామం నిర్మించిన చైనా
Next articleపట్టుబడిన వాహనాలు వేలం : ఎస్పీ సీంధు శర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here