కాకినాడ
తుర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం, చింతపల్లి లాకుల వద్ద యానాం నుండి గొల్లల మామిడాడకు అక్రమ మద్యాన్ని తీసుకువెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్సై వినోద్ తెలిపారు. పెదపూడి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై వినోద్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీ కృష్ణ పర్యవేక్షణలో చింతపల్లి లాకుల వద్ద తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టామన్నారు.. ఈ నేపథ్యంలో మామిడాడ కు చెందిన మేడపాటి సాయి శేఖర్ రెడ్డి మరియు అతని తండ్రి వెంకట రెడ్డి రెండు ప్లాస్టిక్ పెద్ద సంచుల్లో 180ఎంఎల్ గల 100 బాటిల్ల అక్రమ మద్యాన్ని యానాం నుండి గొల్లల మమిడాడకు తీసుకువెలుతున్న వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై వినోద్ వెల్లడించారు.