ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలోని పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన పట్టణ, రూరల్ పోలీస్ సిబ్బంది. మంజునాథ్ ,సీఐ శ్రీనివాస్ నాయక్. రూరల్ ఎస్సై సునీల్ కుమార్. ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా బయలుదేరి అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
దేశ ప్రజల శాంతి భద్రత కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణాలర్పించి వారి త్యాగాలను కొనియాడుతూ 1959 లడక్ లో ఎంతో మంది పోలీసులు ప్రాణాలను పోగొట్టుకున్నారు ఆనాటినుండి దేశంలో ప్రతి సంవత్సరం పోలీసులు అమరవీరులకు నివాళులర్పించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కానిస్టేబుళ్లు. మునిచంద్ర, రఘు,సుధాకర్, మునిస్వామి, పరుశరాముడు,గోపాల్,తదితరులు పాల్గొన్నారు