Home తెలంగాణ ఎమ్మెల్సీని సన్మానించిన కాంగ్రెస్ నేత ఖుతుబొద్దిన్ పాషా

ఎమ్మెల్సీని సన్మానించిన కాంగ్రెస్ నేత ఖుతుబొద్దిన్ పాషా

75
0

కోరుట్ల అక్టోబర్ 11
::
ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శాసన మండలి సభలో ప్రస్తావించిన సందర్భంగా సోమవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వారి నివాసంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆనంతరం మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్తావించిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
చక్కెర కర్మాగారం ముసివేతతో
ఎంతో మంది ఉపాధి లేక అల్లాడిపోతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట కర్మాగారాన్ని వెంటనే తెరిపించి, చెరుకు రైతులు, ఉద్యోగులు, కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు మహమ్మద్ రహీమోద్దీన్, ,మైనారిటీ మాజీ యూత్ అధ్యక్యుడు, మహమ్మద్ నేహాల్, నాయకులు మహమ్మద్ జునేద్ ,మహమ్మద్ ఉబెడ్ ,మహమ్మద్ మదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleస్పీకర్ కాన్వాయి లో ప్రమాదం…వ్యక్తి మృతి
Next articleప్రజల దాహార్థితీర్చడానికి ముందుకు వచ్చిన దంపతులు స్వంత ఖర్చులతో బోర్ వెల్ వేసిన మాజీ కౌన్సిలర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here