Home వార్తలు మందమర్రి లో తెరాస నాయకుడు వినయ్ ఇంటిపై కత్తులతో దాడి దాడిలో వినయ్ సోదరి...

మందమర్రి లో తెరాస నాయకుడు వినయ్ ఇంటిపై కత్తులతో దాడి దాడిలో వినయ్ సోదరి చేయ్యి తెగిపడిన ఘటన

60
0

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండవ జూన్ ప్రాంతంలో బుధవారం రాత్రి తెరాస నాయకుడు10వ వార్డు  అధ్యక్షుడు దొమ్మెటి వినయ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో  దాడి చేయగా అడ్డుకొబోయిన ఆయన సోదరి స్వర్ణలత కు దాడిలో చేయ్యి తెగిపడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.స్థానికుల కథనం ప్రకారం పట్టణం లోని రెండవ జూన్ లో నివసిస్తున్న టి ఆర్ ఎస్ నాయకుడు దొమ్మే టి వినయ్ బుధవారం రాత్రి ఇంటిలో భోజనం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దుండగులు తల్వార్, ఇనుపరాడ్లు, కత్తులతో వినయ్ ఇంటిపై దాడి కి పాల్పడ్డారని తెలిపారు.వినయ్ పై దాడికి ముందస్తు ప్రణాళిక చేసుకున్న దుండగులు కారం పొడి కత్తులతో వచ్చిదాడికి పాల్పడ్డారని,ఎవరు మీరు అని అడ్డుకోబోయిన వినయ్ సోదరి స్వర్ణలత పై తల్వార్ తో దాడి చేయగా ఆమె చేయ్యి పూర్తిగా తెగిపోవడం తోపాటు తలపై తీవ్ర గాయాలై  రక్తం కారుతుండటం గమనించిన వినయ్ ఇంటివెనుక నుండి గోడ దూకి పారిపోయినట్లు తెలిపారు.దాడిని గమనించిన స్థానికులు  పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకోనే క్రమంలో దీనిని గమనించిన దుండగులు పారిపోయినట్లు తెలిపారు.సంఘటణ స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్ఐ భూమెష్ వెంటనే స్పందించి స్వర్ణలత ను పోలీస్ వాహనం లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్నత చికిత్స కోసం హైదరా బాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా స్వర్ణలత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రశాంతంగా ఉన్న పట్టణం లో ఒక్కసారిగా వినయ్ పై కత్తులతో దాడి ఘటన ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసింది.ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై భూ మెష్ మాట్లాడుతూ దాడికి గల కారణాలు తెలియరాలేదని,దుండగులు ఎవరనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Previous articleబ‌హిరంగ ప్ర‌దేశాల్లో గ‌ణేశ్ ఉత్స‌వాలు జ‌రుప‌వ‌ద్దు :ఏపి హైకోర్టు కీల‌క తీర్పు
Next articleతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళా కూలీలు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here