హైదరాబాద్ అక్టోబర్ 29
భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రేడ్ ఎక్స్‌పో విద్యుత్ వాహనాల ప్రదర్శనను హైటెక్స్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..10 వేల విద్యుత్ మోటర్ సైకిల్స్ వినియోగంలోకి వచ్చినట్లైతే సంవత్సరానికి 250 కోట్ల రూపాయల పెట్రోల్ దిగుమతులు ఆదా చేసినవారమౌతామన్నారు. ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం ఛాలెంజ్ గా మారిన నేపథ్యంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరైందని ఆయన చెప్పారు.