Home జాతీయ వార్తలు వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.266కు పెంపు

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.266కు పెంపు

95
0

న్యూఢిల్లీ నవంబర్ 1
దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.266కు పెంచగా.. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్‌ సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్‌ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్‌లో 19 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1950, కోల్‌కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. ఇప్పటికే ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చేరగా.. గ్యాస్‌ ధరలు సైతం చుక్కలనంటుతుండడంతో దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు.
వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటల్స్‌, రెస్టారెంట్లు వినియోగిస్తుంటాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో 14.2 కేజీల నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.899.50 పలుకుతోంది. ఇంతకు ముందు అక్టోబర్‌ 1న 19 కిలోల కమర్షియల్‌, 6న ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగాయి. ప్రస్తుతం 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.50 ధర పలుకుతున్నది. ఇటీవల పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరల దృష్ట్యా ఈ సారి ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.1000 దాటుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే రూ.100 వరకు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Previous articleగుట్కా స్థావరాలపై మెరుపు దాడులు… -గూడూరులో 1500 ప్యాకెట్లు స్వాధీనం….అమ్మకపు దారులు పై కేసు నమోదు -గుట్కా లు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు గూడూరు పట్టణ సీఐ నాగేశ్వరమ్మ
Next articleఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయను : అఖిలేశ్ యాద‌వ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here