పాల్వంచ నవంబర్ 29
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రమైన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ లో కేవలం భజనపరులకు మాత్రమే చోటు ఉంటుందని అన్నారు. ఈరోజు ఆయన పాల్వంచ లో పర్యటించారు. పట్టణం లోని తెలంగాణ నగర్ లో ఈటలకు స్థానికులు స్వాగతం పలికారు. నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు. పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ చెప్పుకొచ్చారు. సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ నగర్ లో నిరుపేదలే ఉంటారనిఅందుకే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పేదల పక్షాన కేసీఆర్ ఉండరని వందల ఎకరాలను ఆక్రమించుకున్నవారు ధనవంతులు బ్రోకర్లకు వత్తాసు పలుకుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలు ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏమిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని జోస్యం చెప్పారు.ఇక హుజూరాబాద్ బైపోల్ ఫలితం తర్వాత కేసీఆర్లో అసహనం పెరిగిపోయిందని దాన్ని రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనడంలేదో చెప్పాలన్నారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈటల. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ముందే చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులను వినియోగించుకుని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.