Home జాతీయ వార్తలు క‌రోనాపై పోరాటంలో అసాధార‌ణ మైలురాయిని అందుకున్న‌ఇండియా

క‌రోనాపై పోరాటంలో అసాధార‌ణ మైలురాయిని అందుకున్న‌ఇండియా

106
0

న్యూఢిల్లీ అక్టోబర్ 21
క‌రోనాపై పోరాటంలో ఇండియా అసాధార‌ణ మైలురాయిని అందుకున్న‌ది. ఇవాళ్టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసుల‌ను పంపిణీ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. ఇండియా చ‌రిత్ర సృష్టించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. భార‌తీయ సైన్సు, వ్యాపారంతో పాటు 130 కోట్ల మంది భార‌తీయుల స్పూర్తికి ఇది సాక్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు. వ్యాక్సినేష‌న్‌లో వంద కోట్లు దాటిన నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. ఈ అద్భుత‌మైన ఘ‌న‌త సాధ‌న కోసం కృషి చేసిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Previous articleచంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం
Next articleఈ నెల 25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here