కామారెడ్డి నవంబర్ 25
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు దయ్యాలు ఉన్నాయని భయపడుతున్నారు అని పత్రికల్లో మీడియాలో వచ్చిన ఈ వార్తకు స్పందించిన భారత నాస్తిక సమాజం బృందం ఈరోజు ఆ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మూఢనమ్మకాల మీద అవగాహన కల్పించడం జరిగింది. వార్డెన్ నిర్మల గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థులకు ఆత్మ దయ్యం ఉండవని వాటిని నమ్మి భయానికి గురి కావద్దని బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించాలని చదువుకున్న మనం కూడా మూఢనమ్మకాలు నమ్మి మోసపోవద్దని భారత నాస్తిక సమాజం నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి కేసరి హరి భూషణ్, పెరుమాండ్ల బుల్లెట్ అన్నారు. త్వరలో పాఠశాలలో విద్యార్థులు అందరికీ మరియు తల్లిదండ్రులకి శాస్త్రీయ అవగాహన సదస్సు నిర్వహించి వివిధ మ్యాజిక్ ల తో విద్యార్థులకు తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుందని గురైన విద్యార్థులకు సైకాలజిస్టు ద్వారా ప్రత్యేక మోటివేషన్ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో బిబి పేట మండల అధ్యక్షులు యోగి రామారెడ్డి మండల అధ్యక్షులు తలారి మోహన్ సభ్యులు కపిల్ రాజు పాఠశాల వార్డెన్ నిర్మల స్కూల్ కమిటీ చైర్మన్ దివిటీ కిష్టయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.