5 వ రోజు రిలే దీక్షలు ప్రారంభించిన, మాజీ మంత్రి ,యమ్ యల్ సీయన్ యమ్ డి ఫరూక్
నంద్యాల
నంద్యాల పట్టణంలో సోమవారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా 5 వ రోజు రిలే దీక్షలు చేపట్టారు . ఈ దీక్షలో కూర్చున్న వారు పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు, కాంగ్రెస్ జిల్లా కోశాధికారి యస్ వై డి , ప్రసాద్ కాంగ్రెస్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్, మైనార్టీ నాయకుడు కాశిమ్ , బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు రవి, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు అజయ్ ,సాయి కూర్చడం జరిగింది .ఈ దీక్షలకు అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్యా అధ్యక్షత వహించారు. ఈ దీక్షలకు ప్రారంభంగా మాజీ మంత్రి ,యమ్ యల్ సీ ,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు ఫరూక్. ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ,యమ్ యల్ సీ ,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు ఫరూక్,
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర మౌలానా ముస్తాక్ అహ్మద్ ,పీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు,ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూస్తే ఎంతో బాధ వేస్తుందని ప్రజల మీద అనవసరమైన భారాలు మోపుతూ చెత్త పన్ను విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లు రద్దు చేయాలని గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని ఇంటి చెత్త కుళాయి మురికి కాలువల పన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కర్షకులు కార్మికులు సాధారణ పౌరులు మొత్తం కూడా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎటువంటి అదుపు లేకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద విరమించుకోవాలని దీక్ష సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది . కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక లో డిమాండ్ చేశారు. అబద్ధాల హామీలు కేంద్రంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ మోహన్ రెడ్డి ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావలసింది ఉపాధి కావాలంటే ఆంద్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటు చేయాలి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలి పథకాలు ఇవ్వడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు రాదని మండిపడ్డారు.
విద్యుత్ వ్యవసాయ బిల్లును రద్దు చేయాలి వారు డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు మద్దతు ఇచ్చిన వారు పిడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, జాను జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.