నందవరం
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో యశోద ఎంటర్ టైన్మెంట్స్ వై ఉమాదేవి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్క నున్న ఇన్ఫార్మర్ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఎమ్మిగనూరు వైకాపా సీనియర్ నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.శుక్రవారం
ఎమ్మిగనూరు పట్టణం వీవర్స్ కాలనిలోని ఓ ఇంటిలో కొత్త సినిమా ఇన్ఫార్మర్ షూటింగ్ సనివేశాన్ని జగన్ మోహన్ రెడ్డి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీ నీలకంటేశ్వర స్వామి క్రియేషన్స్ అధినేతలు ప్రముఖ సినీ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి సంజీవ రెడ్డి రూపా జగదీష్, కరణం దేవేందర్ రెడ్డి (జయ సూర్య సినిమా నిర్మాత) సమక్షంలో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. యశోద ఎంటర్ టైన్మెంట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఇన్ ఫార్మర్ చిత్రానికి నిర్మాతగా అగ్రహారం నాగిరెడ్డి వై ఉమాదేవి
హీరోగా అగ్రహారం వినోద్ రెడ్డి హీరోయిన్ గా బెంగళూరు కు చెందిన రుచిత ,రచయిత గా గురు తేజ , దర్శకుడు గా విఎన్ వసంత్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు దర్శకుడు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సినీ రంగంలో రాయలసీమ నుండి దర్శకులు నిర్మాతలు హీరో హీరోయిన్ నటులుగా ఎదగడం సంతోషకరం. జయ సూర్య ,తెనాలి రామకృష్ణ, బుజ్జి ఇలా రా, సినిమాలు తెరకెక్కించిన అనుభవం జీ నాగేశ్వర రెడ్డి అగ్రహారం నాగి రెడ్డి రూపా జగదీష్ దేవేందర్ రెడ్డి సంజీవ రెడ్డి లకు ఉందన్నారు. స్థానిక కళాకారులలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇటువంటి చిన్న సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇన్ఫార్మర్ చిత్ర కథలో జర్నలిస్టు సేకరించిన సమాచారం తెలుసుకున్న కొందరు జర్నలిస్టును హత్య చేస్తారు.మిస్టరీగా మారిన హత్య చేదించడం జరుగుతుంది.అలాగే హాస్యాన్ని పండించే సన్నివేశాలు ఉన్నాయి. కార్యక్రమంలో పొనకలదిన్నె ఉప పీఠాధిపతి ఇద్రుస్ స్వాములు టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ నాయకులు రియాజ్ బుట్టా రంగయ్య అగ్రహారం విజయ్ కుమార్ రెడ్డి యశోద ఉమాదేవి పాల్గొన్నారు.