నంద్యాల
నంద్యాల పట్టణంలో శనివారం నాడు సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ
నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని వైయస్సార్ నగర్ .పై భాగాన ఉన్న బుడగ జంగాల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ . చిన్న వ్యాపారుల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు నందమూరి నగర్ సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి మా భాష డిమాండ్ చేశారు. బుడగ జంగాల కాలనీ ఏర్పడి దాదాపు 12 సంవత్సరములు కావస్తున్నదని
అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవన్నారు. చిన్నపాటి వర్షానికి అక్కడ రహదారులన్నీ బురదమయం అయి వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది విష పురుగులు చేరి వాటి వల్ల అక్కడి ప్రజలు అంటురోగాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు . అంతేకాకుండా కుళాయి లలో మురికి నీరు కలుషితమైన నీరు రావడం వలన ఆ నీరు తాగి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ వారి పిల్లలకు సరైన స్కూలు కూడా లేవన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూన్నాము. లేని పక్షంలో బుడగ జంగాల వారితో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నారాయణ. మౌలాలి. కవిత. సుధాకర్. సుంకన్న. జె. నారాయణ. జమ్మ అక్క తదితరులు పాల్గొన్నారు.